Tag Archives: sankranthi

దుర్గా వాహిని ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

నిజామాబాద్‌, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వహిందూ పరిషత్‌ యొక్క అనుబంధ సంస్థ దుర్గావాహిని ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రము మరియు బుస్సాపూర్‌, ఇందూరు నగరంలోని ఇంద్రాపూర్‌, మోస్రా మండల కేంద్రంలో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు దుర్గా వాహిని …

Read More »

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.

Read More »

రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు

హైదరాబాద్‌, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్‌, సంతోష పొంగల్‌, జీ20 పొంగల్‌ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని …

Read More »

ముగ్గుల్లో ప్రభుత్వ పథకాలు

రెంజల్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాలు ముగ్గుల రూపంలో తెలియపరచిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోధన్‌ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా సోమవారం రెంజల్‌ మండల కేంద్రంతో పాటు కందకుర్తి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను …

Read More »

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …

Read More »

ఆరేపల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు…

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట మండల తాసిల్దార్‌ జానకి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ జానకి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇలాంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »