Tag Archives: telangana university

మోటివేషనల్‌ స్పీకర్‌ను సన్మానించిన విసి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మోటివేషనల్‌ స్పీకర్‌ భాగవతుల శివ శంకర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య డి.రవీందర్‌ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్‌ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వివిధ కార్పొరేట్‌ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్‌ మేనేజ్మెంట్‌ విషయంపైన ఉపన్యసించారు.

Read More »

అర్జున్‌కి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్‌కి బుధవారం జరిగిన వైవా-వోక్‌ కార్యక్రమంలో డాక్టరేట్‌ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్‌. అరుణ పర్యవేక్షణలో అర్జున్‌ ‘‘క్యారెక్టరైజేషన్‌ ఆఫ్‌ సర్టైన్‌ మెంబెర్స్‌ ఆఫ్‌ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్‌ ఫ్రమ్‌ ద ప్యాడి ఫిల్డ్స్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌, తెలంగాణ స్టేట్‌, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు. …

Read More »

29 నుండి సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎం.ఇడి 2వ, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Read More »

జాతీయ సాహస శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్‌ (మనాలి) హిమాచల్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. రవీందర్‌ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్‌ జెంట్‌ లీడర్‌గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్‌లోని …

Read More »

నాపా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును కలిసిన వీసీ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్‌ అమెరికా పద్మశాలి అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్స్‌ చైర్మన్‌ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో …

Read More »

టియు డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా ఆచార్య సత్యనారాయణ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా ఆచార్య సత్యనారాయణని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచేపల్లి రవీందర్‌ గుప్త ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య విధ్యావర్ధిని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య వి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని ఇచ్చినందుకు వి.సి., రిజిస్ట్రార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయంతో తే.యు.ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయుటకు …

Read More »

సంవత్సరం పాటు అధికారుల కాలపరిమితి పెంపు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న వివిధ పరిపాలన అధికారుల కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ఆచార్య రవీందర్‌ గుప్తా తెలిపారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా ఆచార్య విధ్యావర్డిని, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డా. సాయిలు, కాంపిటీటివ్‌ సెల్‌ డైరెక్టర్‌గా డా. జి. బాల …

Read More »

సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్‌ ఇవ్వొద్దు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జివిఎస్‌, ఏఐఎస్‌బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి …

Read More »

పిజి పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన పి.జి. పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »