డిచ్‌పల్లి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆర్మూర్‌లో డిగ్రీ 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష కేంద్రాలు అయిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నరేంద్ర డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విసి వెంట పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య యమ్ అరుణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ ఉన్నారు.
Read More »పదోన్నతులు కల్పించాలని నిరసన
డిచ్‌పల్లి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అధ్యాపకులుగా చేరిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మండి అడ్మినిస్ట్రేషన్ భవనము వరకు బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డా బాలకిషన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు కల్పించకుండా 2014 అధ్యాపకుల పట్ల వివక్షతను చూపుతున్నారన్నారు. …
Read More »తెలుగులో శమంతకు డాక్టరేట్
డిచ్‌పల్లి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఎస్. శమంతకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. శమంత తెలంగాణ సాహిత్యం శ్రామిక జీవన చిత్రణ (2000-2010) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. …
Read More »బి.ఇ.డి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
డిచ్‌పల్లి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ చాంబర్ వద్ద డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా …
Read More »పదోన్నతులు కల్పించండి…
డిచ్‌పల్లి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీలో 2014 లో నియమితులైన రెగ్యులర్ అధ్యాపకులు వారికి పదోన్నతులు కల్పించక పోవడంపట్ల గురువారం ధర్నా నిర్వహించారు. 2014 లో నియమితులైన అధ్యాపకుల అధ్యక్షుడు డా. బాలకిషన్, కార్యదర్శి డా. లక్ష్మణ్ చక్రవర్తి మాట్లాడుతూ తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్
డిచ్‌పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్ క్యాంపస్ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేర్ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …
Read More »తెయులో ఎయిడ్స్ అవగాహన సదస్సు
డిచ్‌పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్.యస్.యస్ యూనిట్ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హల్‌లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్ …
Read More »అక్రమ టీచింగ్ పోస్టులు రద్దు చేయాల్సిందే
డిచ్‌పల్లి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకి పి.డి.ఎస్.యు, పీ.వై.ఎల్ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ …
Read More »అక్రమ నియామకాలు రద్దుచేయాలని ఫిర్యాదు
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్ నవీన్ మిట్టల్‌కి పి.డి.ఎస్.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు నరేందర్ మాట్లాడుతూ టీచింగ్, నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన …
Read More »వసతి గృహాలు తనిఖీ చేసిన వైస్‌ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు. వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్ వార్డెన్ డా. …
Read More »