Tag Archives: telangana

కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …

Read More »

బర్రెలక్క బాటలో… గల్ఫ్‌ అభ్యర్థి

నిర్మల్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్‌ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్‌ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్‌ కార్మికుల …

Read More »

కాంగ్రెస్‌ విజయం ఖాయం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని కాంగెస్ర్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ అన్నారు. రాజంపేట మండలంలోని సిద్దాపూర్‌, ఎల్లాపూర్‌ తండా, నడిమి తండా, గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్‌, అరగుండా, అన్నారం, బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్‌ …

Read More »

ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్‌ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ …

Read More »

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ …

Read More »

సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్‌ …

Read More »

బిజెపిలో భారీ చేరికలు

ఆర్మూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం వల్లభపూర్‌ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్‌ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు. పైడి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్‌ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు …

Read More »

గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి

కోరుట్ల, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్‌ జెఏసి నాయకుడు కిరణ్‌ కుమార్‌ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్‌. గార్డెన్స్‌ లో మంగళవారం జరిగిన గల్ఫ్‌ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో …

Read More »

సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం

బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం 177 బూత్‌ పరిధిలోని 11, 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోగు నారాయణ, అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగింది. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. టిఆర్‌ఎస్‌ పార్టీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »