Tag Archives: telangana

ఎమ్మెల్సీ పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిజామాబాద్‌ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి, ఇతర ముఖ్య …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా జమీల్‌ హైమద్‌..

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శిల్ప (24) కి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావాలని వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతన సమూహ అధ్యక్షులు జమీల్‌ హైమద్‌ 28 వ సారి ప్రభుత్వ వైద్యశాల లోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

జ్యోతిబా ఫూలే హాస్టల్లో రాత్రి బస చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్‌ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌ ను అడిగి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఫిబ్రవరి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 11.54 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 03.49 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 9.22 వరకుకరణం : కౌలువ ఉదయం 8.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.46 – 8.29దుర్ముహూర్తము : ఉదయం 8.46 …

Read More »

రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తాం…

బాన్సువాడ, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఢల్లీి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తామని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రాల్లో అమలు కానీ హామీలను ఇచ్చి రాష్ట్రాలను …

Read More »

పంటల క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్‌ వ్యాపారులు మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి పంటను సేకరించేలా చూడాలన్నారు. …

Read More »

ధర్మ పరిరక్షణకు పాటుపడాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్మ రక్ష పరిరక్షణకు పాటుపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్‌ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో హిందూసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాన్ని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ …

Read More »

ఆధార్‌ బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేయించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్‌ బయోమెట్రిక్‌ ను అప్‌ డేట్‌ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా …

Read More »

ఆలూర్‌లో గంజాయి వినియోగంపై పోలీసుల పెట్రోలింగ్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండల కేంద్రంలో ఆర్మూర్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ సత్యనారాయణ గౌడ్‌ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ చిన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ చిన్నయ్య మాట్లాడుతూ గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, చట్టపరంగా నేరమని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత …

Read More »

మైనారిటీ రెసిడెన్షియల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

కోటగిరి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోతంగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »