Tag Archives: velpoor

వరద నీటిలో వరిపంట…

వేల్పూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వేసిన వరి పంట కొట్టుకుపోవడం జరిగిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు వరి పంట పోయిందని, 75 ఎకరాల వరి పంట కొట్టుకుపోయిందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం వాటిల్లిన పంట పరిశీలించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని …

Read More »

ఛలో రాజ్‌భవన్‌… నాయకుల అరెస్ట్‌

వేల్పూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్‌ గౌడ్‌, బీసీ సెల్‌ అధ్యక్షులు రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.

Read More »

వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …

Read More »

జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు …

Read More »

తక్కువ పెట్టు బడితో అధిక లాభాలు

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పుర్‌ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్‌ గౌడ్‌ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …

Read More »

నూతన వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి

వేల్పూర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు మేలు రకమైన పద్ధతులు, అవలంబిచ్చినట్లయితే నూతన వ్యవసాయ పద్ధతులతో మేలురకమైన వంగడాలు, ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వేల్పూర్‌ వ్యసాయ శాఖ అధికారి నర్సయ్య తెలిపారు. శనివారం వేల్పూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య వ్యవసాయ క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను పరిశీలించారు. …

Read More »

సిఎంఆర్‌ఎప్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద ఆర్టిఏ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ రేకుల రాములు, టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బురి ప్రతాప్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా …

Read More »

ఛలో రాజ్‌భవన్‌… ముందస్తు అరెస్టులు

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అధిక ధరలు, పెట్రోలు పెంపుపై చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా వేల్పూర్‌ మండలంలో రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుంకేట్‌ అన్వేష్‌ రెడ్డిని, వేల్పూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డం నర్సిరెడ్డిని పలువురు కాంగ్రెస్‌ నాయకులను తెల్లవారుజామున వేల్పూర్‌ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్‌ రాజేష్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం …

Read More »

దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

వేల్పూర్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిర్మల్‌ జిల్లాలో సాంకేతిక సహాయకులు రాజు పై సర్పంచ్‌ హత్యాయత్నానికి నిరసనగా జిల్లా జేఏసి పిలుపు మేరకు బుధవారం వేల్పూర్‌ మండలంలోని ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల రిబ్బన్‌ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపివో అశోక్‌ మాట్లాడుతూ దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకులు రాజుకి ప్రభుత్వం తరఫున మెరుగైన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »