Tag Archives: video conference

కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు …

Read More »

ఉపాధి హామీ అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు హనుమంత రావుతో కలిసి ఉపాధి హామీ సామాజిక తనిఖీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. …

Read More »

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు కంటి వెలుగు, పోడు భూములు, జీ.ఓ నెం.లు 58 …

Read More »

కంటి వెలుగు శిబిరాల నిర్వహణ భేష్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చక్కటి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, కంటి వెలుగు శిబిరాలు ముగిసేంత వరకు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం సాయంత్రం …

Read More »

పోడు పట్టాలను సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం …

Read More »

మన ఊరు – మన బడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ దేవసేన …

Read More »

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు …

Read More »

కంటి వెలుగు శిబిరాల్లో నాణ్యమైన సేవలందించాలి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సీ.ఎస్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …

Read More »

జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »