నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇప్పటికే పక్షం రోజులు జాప్యం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల నుండి వరి ధాన్యం సేకరించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …
Read More »మన ఊరు – మన బడి, ఉపాధి పనుల్లో ప్రగతి కనిపించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల అంచనా వివరాలతో కూడిన నివేదికలను వెంటదివెంట అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు-మన బడి, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై స్పెషలాఫీసర్‌లు, మండల అధికారులతో …
Read More »వారం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలను ఇంజనీరింగ్ అధికారులు వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మన ఊరు- మన బడి కార్యక్రమంపై ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల …
Read More »పక్షం రోజుల్లోపు పనులు ప్రారంభించాలి
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అవసరమైన పనులను గుర్తిస్తూ, పక్షం రోజుల్లోపు అవి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, విద్యా శాఖ, …
Read More »ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో పనులు
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండలానికి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బిచ్కుంద నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం వంటి పనులు చేయడానికి ఇంజనీరింగ్ …
Read More »బస్తీ దవాఖానాల కోసం స్థలాలు ఎంపిక చేయాలి
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి, స్వఛ్ఛ సర్వేక్షన్, బస్తీ దవాఖానలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణాల్లో బస్తి దావఖానాల కోసం మున్సిపల్ అధికారులు స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్ష …
Read More »ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో అద్భుతాలు
నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన …
Read More »ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్ ఆగ్రహం…
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …
Read More »చిన్నారుల వివరాలు యాప్‌లో నమోదు చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్‌లో నమోదు చేయాలని …
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అదేవిధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 773 మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరందరి …
Read More »