నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్, ఉపాధి హామీ, …
Read More »ప్రసవాలు జరుగని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జీతాలు నిలుపుదల చేయాలి
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవసరం లేకపోయినా సిజీరియన్ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో నూటికి నూరు శాతం సీజీరియన్ కాన్పులే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో …
Read More »ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నివాస ప్రాంతంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేనిచోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామ చావిడి, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల …
Read More »విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలి
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేనాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పల్లె ప్రగతిలో పెండిరగ్ పనుల విషయమై ట్రాన్స్ కో, ఎంపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పట్ల …
Read More »‘కంటి వెలుగు’లో భాగంగా కాటరాక్టు ఆపరేషన్లు చేపట్టాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంపిక చేసిన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …
Read More »ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా పల్లె, పట్టణ ప్రగతి సాగాలి
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే దిశగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసేంతవరకు పక్షం రోజులపాటు అధికారులందరూ వారికి కేటాయించిన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్యపరమైన సమస్యలను మినహాయిస్తే ఇతర కారణాలతో ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని స్పష్టమైన …
Read More »ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్.సి వారీగా …
Read More »విద్యా యజ్ఞంలా మన ఊరు – మన బడి
నిజామాబాద్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తరహాలో చేపట్టి, పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో అలరారే విధంగా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం …
Read More »మే 10 లోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 10 లోగా మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వారు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు …
Read More »ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం, మన ఊరు – మన బడి, ధరణి కార్యక్రమాల అమలులో ప్రగతి గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »