Tag Archives: vinayaka chaviti

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాల …

Read More »

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆభయ ఆంజనేయ ఆలయం, కల్కి నగర్‌ నందు వినాయక చవితి పండుగ సందర్బంగా 100 ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విగ్రహాల దాత కమిటీ సభ్యుడు కొత్త సంతోష్‌ కుమార్‌ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షులు అంభీర్‌ రాజేందర్‌ రావు, గంగ చరణ్‌, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

మట్టి గణపతులువితరణ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు. ఆదివారము విశ్వనాధుల మహేష్‌ గుప్తా నివాసం …

Read More »

గణేష్‌ విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గణేష్‌ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ రంజిత్‌ వెల్లడిరచారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మంగళవారం పలు గణేశ్‌ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గణపతి మండపాల వద్ద అన్నదానం చేపట్టారు. మండల కేంద్రంలోని గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ శంకర్‌, గణేష్‌ యూత్‌ …

Read More »

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో నిర్వహించే గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్‌ గోవర్ధన్‌, సిఐ వెంకట్‌ మంగళవారం పరిశీలించారు. శని, ఆదివారాలలో నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి ఏవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకున్నారు. గ్రామంలో తిరిగి రోడ్ల గుంతలను పరిశీలించారు. శోభాయాత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు. అలాగే నిమజ్జనం నిర్వహించే స్థానిక వాగు …

Read More »

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్‌ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …

Read More »

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు, పథకాలు ఎలాంటి ఆటంకాలు …

Read More »

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »